Home తాజా వార్తలు కూతురు మృతి : తల్లిదండ్రుల ఆత్మహత్య

కూతురు మృతి : తల్లిదండ్రుల ఆత్మహత్య

Couple Commits Suicide In Bhadradri Kothagudemభ‌ద్రాద్రి కొత్త‌గూడెం : కూతురు మృతి చెందడంతో మనస్తాపానికి గురైన ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  హైదరాబాద్‌ ఈసీఎల్‌కు చెందిన పమ్మి లక్ష్మణాచారి (55), హేమలత (48) దంపతుల కుమార్తె సాత్విక పది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో లక్ష్మణాచారి, హేమలత దంపతులు మనోవేదనకు గుర‌య్యారు. పాల్వంచలో ఉన్న హేమలత అన్న వేమనకుమార్‌ వారిని తన ఇంటికి బుధవారం తీసుకొచ్చాడు. వేమనకుమార్‌ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో దంపతులిద్దరూ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదేని, తమ కూతురు సాత్విక లేని జీవితం తమకొద్దని, అందుకే చనిపోతున్నామంటూ వారు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి బూర్గంపహాడ్‌ పంపు హౌస్‌ వద్ద లక్ష్మణాచారి, హేమలత మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం లక్ష్మణాచారి, హేమలత  మృతదేహాలను బూర్గంపహాడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.