Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Road Accidentరంగారెడ్డి : రాజేంద్రనగర్ పరిధిలోని అప్పా జంక్షన్‌ సమీపంలోని హిమాయత్‌ సాగర్‌ సర్వీస్‌ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న నాగరాజు దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. వారి కూతురు తీవ్రంగా గాయపడడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మృతులు మహబూబ్‌నగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మైనర్‌ బాలుడు కారును వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న నలుగురు మైనర్లలో  ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం కోసం నాగరాజు దంపతుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Couple Dead In Road Accident At Rajendra Nagar