Home తాజా వార్తలు నాగార్జున ఫామ్‌హౌస్‌లో దంపతుల మృతి!

నాగార్జున ఫామ్‌హౌస్‌లో దంపతుల మృతి!

Couple died with Electric Shock in Akkineni Nagarjuna's Formhouse

హైదరాబాద్: నగర శివార్లలోని కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ ప్రాంతంలో గల హీరో అక్కినేని నాగార్జున ఫామ్‌హౌస్‌లో విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందారు. వ్యవసాయ క్షేత్రంలో వెంకటరాజు, దుర్గ దంపతులు గత కొంతకాలంగా కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే రాత్రి ఇంట్లో విద్యుత్ పోవడంతో పొలంలోనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. ఆ సమయంలో ఓ కరెంట్ తీగ తెగిపడి ఉండటాన్ని గమనించని అతడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కరెంట్ షాక్ తగిలి భర్త విలవిల్లాడుతుంటే అతన్ని కాపాడేందుకు భార్య దుర్గ ప్రయత్నించింది. దాంతో ఆమె కూడా విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతులు ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందినవారని సమాచారం.