Home తాజా వార్తలు సింగూరు ప్రాజెక్టులో జంట గల్లంతు

సింగూరు ప్రాజెక్టులో జంట గల్లంతు

Person-Drown-In-Ganga

సంగారెడ్డి : పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో ఓ జంట గల్లంతైంది. హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన రెండు జంటలు శనివారం సింగూరు ప్రాజెక్టు సందర్శనకు వచ్చాయి. అందులో ఓ జంట సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న జలవిద్యుత్ కేంద్రం వద్ద నీటిలోకి దిగి ఆటలాడుతుండగా నీట మునిగి గల్లంతైంది. దీంతో భయపడిన మరో జంట అక్కడి నుంచి పరారైంది. గల్లంతైన వారు నజీరుద్దీన్ (25), షరీంబేగం(19)గా గుర్తించారు. మరో జంట వివరాలు తెలియరాలేదు. నజీరుద్దీన్ జిల్లాలోని రాయికోడ్ మండలం ఎన్కేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని, వారు హైదరాబాద్ బోరబండలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. గల్లంతైన జంట కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Couple Drown in  Singur Project