Home జాతీయ వార్తలు లాక్‌డౌన్ ఎఫెక్ట్.. వీడియో కాలింగ్ ద్వారా పెళ్లి (వీడియో)

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. వీడియో కాలింగ్ ద్వారా పెళ్లి (వీడియో)

video-call-marriage

ఔరంగాబాద్: కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రలో మరో వివాహం వీడియో కాలింగ్ ద్వారా జరిగింది. టెక్నాలజీని వినియోగించుకుని ఫోన్ ద్వారానే మతపెద్దలు కల్యాణం జరిపించారు. ఔరంగాబాద్ కు చెందిన మహ్మద్ మిన్హాజుద్ అనే వ్యక్తి వీడియో కాల్ ద్వారా బీడ్ గ్రామ మహిళతో పెళ్లి జరిపించారు. దేశంలో 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆరు నెలల క్రితమే వీరి వివాహం నిర్ణయించబడిందని వరుడి తండ్రి మొహమ్మద్ గయాజ్ చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో వివాహం వాయిదా వేసుకోవడం ఇష్టంలేని ఇరు కుటుంబాలు పెళ్లిని జరిపించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆన్ లైన్ లో నవదంపతుల చేేత పెద్దలు నిఖా కుబుల్ అనిపించారు. ఈ వివాహం ఇలా జరిగినందుకు ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు.

 

Couple exchange wedding vows over video call