Home తాజా వార్తలు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న దంపతులు

రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న దంపతులు

Suicide

 

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మధుర ప్రాంతంలో ఓ దంపతులు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హత్నా గ్రామానికి చెందిన భగీరథ, ప్రియా అనే దంపతులు వాళ్ల కుటుంబ సభ్యులతో పలుమార్లు గొడవలకు దిగారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన నచ్చకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దంపతులు తమ గ్రామానికి దగ్గరలో  ఉన్న రైల్వే స్టేషన్‌కు బైక్‌పై చేరుకున్నారు. చనిపోయేముందు భగీరథ తన తండ్రి రాజేంద్రకు ఫోన్ చేయడంతో తన బైక్ ఇచ్చిపోవాలని తండ్రి సూచించాడు. రైలు వస్తుండగా దాని ముందు దూకడంతో ఘటనా స్థలంలోనే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైల్వే పోలీస్ అధికారి రమేష్ ప్రసాద్ భరద్వాజ్ ఘటన స్థలానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రెండు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Couple Jump Front of Train in Uttarpradesh