Home తాజా వార్తలు విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

Couple killed

 

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని కురివి మండలం సీరోలు గ్రామంలో మంగళవారం దంపతులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురై యువ దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఆలకుంట్ల ఉపేందర్‌ (25) భార్య భవాని(22) దుస్తులు ఆరేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తాకినట్లు తెలుస్తోంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త ఉపేందర్ కూడా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్‌, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. మృతుల కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Couple killed with Electrocution