Home తాజా వార్తలు ఏక కాలంలో పిహెచ్‌డి పట్టా పొందిన దంపతులు…

ఏక కాలంలో పిహెచ్‌డి పట్టా పొందిన దంపతులు…

Graduated PhD

 

దుబ్బాక : దుబ్బాకకు చెందిన ఇద్దరు దంపతులకు ఏకకాలంలో అరుదైన అవకాశం దక్కింది. ఉస్మానియా విశ్వ విద్యాలయం 80వ పిహెచ్‌డి స్నాతకోత్సవ సభలో రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన వీసీ, ఐఐసీటీ డైరెక్టర్‌ల చేతుల మీదుగా డాక్టర దేవేంద్ర నర్సింహాచారి దంపతులు పిహెచ్‌డి పట్టా పొందారు.

డాక్టర్ నర్సింహాచారి ప్రముఖ ప్రఖ్యాత అంతర్జాతీయ జ్యోతిష్య పండితులుగా పనిచేస్తున్నారు. ఎంఏ జ్యోతిష్యంలో పిహెచ్‌డి గోల్డ్ మెడల్ పొందారు. ఇవేగాక ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ యోగాతో పాటు జ్యోతిష్య శాస్త్రాలపై నాలుగు డిప్లొమాలు చేశారు. ఇంత వరకు ఇతను పొందిన బిరుదులు అంతర్జాతీయ జ్యోతిష్య బ్రహ్మ, జ్యోతిష్య ముహుర్త సార్వభౌమ, ఉగాది పురస్కార స్వర్ణకంకణ సన్మాన గ్రహిత, యాగ్నిక బ్రహ్మ, యాగ్నిక సామ్రాట్, జ్యోతిష్య అభిజ్ఞ జ్ఞాననిధి.

అలాగే డాక్టర్ దేవేంద్ర హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్నారు. ఈమె విద్యాభ్యాసం ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, పిహెచ్‌డి పొందారు. దంపతులు ఇరువురు ఉగాది పురస్కారంతో పాటు పలు అవార్డులు పొంది ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొనడం జరిగింది. డాక్టర్ నర్సింహాచారి పిహెచ్‌డిలో మహాభారతంలో జ్యోతిష్య ప్రస్థావనలు, దేవేంద్ర పరిశోధనాంశం, తెలంగాణ కథ, వర్తమాన జీవన చిత్రణపై పరిశోధన చేశారు. తాము ఇరువురు ఇంత గొప్ప స్థాయికి చేరుకోవడానికి సహకరించిన గురువులు, కుటుంబ సభ్యులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Couple who Graduated PhD in one Time period