Friday, April 19, 2024

టిక్‌టాక్‌పై నిషేధానికి బ్రేక్

- Advertisement -
- Advertisement -

Court in United States has issued restraining order on ban on tiktok

 

కాలిఫోర్నియా : అమెరికాలో టిక్‌టాక్ నిషేధంపై అక్కడి న్యాయస్థానం నిలిపివేత ఉత్తర్వులు వెలువరించింది. దేశంలో టిక్‌టాక్ ఇతర యాప్‌లు నిఘా చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ అమెరికా అధికార యంత్రాంగం ఈ పాపులర్ యాప్‌పై నిషేధం విధించింది. దీనికి సంబంధించి దేశంలోని వాణిజ్య విభాగం వెలువరించిన నిషేధపు ఉత్తర్వులను అమెరికా జడ్జి నిలిపివేశారు. పెన్సిల్వినియా న్యాయమూర్తి నవంబర్ 12 నుంచి అమలులోకి వచ్చే నిషేధ ఉత్తర్వులను నిలిపివేశారు. దీనితో అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాల నిలిపివేతకు తాత్కాలిక బ్రేక్ పడింది. కామర్స్ డిపార్ట్‌మెంట్ వెలువరించిన ఉత్తర్వులపై జిల్లా జడ్జి వెండీ బీట్లెస్టోన్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది వ్యక్తిగతంగానూ ఇందులో పది కోట్లకు పైగా అమెరికాలోనూ ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారని, పైగా కనీసం 5 కోట్ల మంది దీనిని రోజువారిగా వాడుతున్నారని, దీనిపై నిషేధం విధింపు భావవ్యక్తీకరణ ప్రక్రియకు విఘాతం అని పేర్కొంటూ ఆమె ఈ నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News