Thursday, April 18, 2024

తెరవెనుక హీరోయిన్ ఆమే

- Advertisement -
- Advertisement -
Chhapaak
ఛపాక్ సినిమా తెరపై లాయర్ పేరు

న్యూఢిల్లీ : యాసిడ్ దాడి బాధితురాలి ఉదంతంతో వచ్చిన సినిమా ఛపాక్ స్థానిక పటియాలా న్యాయస్థానం స్పందించింది. ఈ సినిమాకు సంబంధించి బాధితురాలి త రఫు న్యాయవాది అపర్ణ భట్ కు కూడా గుర్తింపు నివ్వాలని ఆదేశించారు. యాసిడ్ దాడి బాధితురాలైన లక్ష్మీ అగర్వాల్ తరఫున న్యాయవాది అపర్ణ భట్ న్యాయస్థానాలలో వాదించి బాధితురాలికి న్యాయం అందేలా చేశారు. ఈ బాధితురాలి జీవితాన్ని ప్రధాన పాత్రగా తీసుకుని ప్రముఖ హీరోయిన్ దీపిక పడుకోనే, తానే నాయికగా, ఈ ఛపాక్ సినిమా తీశారు. ఆమె కేసును వెలుగులోకి తీసుకురావడంతో లాయరు భూమికను ప్రస్తావించాల్సి ఉందని అదనపు సివిల్ జడ్జి పంకజ్ శర్మ స్పష్టం చేశారు.

సినిమా ప్రచారం, ప్రదర్శనల దశలో ఖచ్చితంగా ఈ లాయరు సేవలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు ఉండాలని న్యాయమూర్తి తెలిపారు. మహిళలపై భౌతిక, లైంగిక దాడులకు వ్యతిరేకంగా అపర్ఱ భట్ కేసులు వాదించేందుకు సిద్ధంగా ఉన్నారనే వ్యాఖ్యలను తెరపై , యాడ్ పబ్లిసిటీలోనూ ప్రదర్శించాలని ఆదేశించారు. తాను ఈ సినిమా చిత్రీకరణ, కథ రూపకల్పనలో పూర్తిగా సహకరించానని, తనకు క్రెడిట్ ఇవ్వాలని ఎంతగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో, సినిమా విడుదలకు ముందు పిటిషన్ వేసినట్లు లాయర్ తెలిపారు. ఇంతకాలం కేవలం గ్లామర్ సినిమాలకు పరిమితం అయిన దీపిక తొలిసారిగా ఇందుకు విరుద్ధంగా అత్యంత కీలకమైన సామాజిక అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, యదార్థ ఘటనను ఎంచుకుని ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

Court Orders Chhapaak Makers To Give Credit To Aparna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News