Home తాజా వార్తలు శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

Marri Srinivas Reddyయాదాద్రి భువనగిరి: అమ్మాయిల వరుస హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజిపూర్ సైకో కిల్లర్ మానవ మృగం కీచకుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసు కస్టడీకి మంగళవారం న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం శ్రావణి హత్య కేసులో అరెస్టై వరంగల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కనీసం ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అతన్ని ఇవ్వాలని భువనగిరి పోలీసులు సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు మంగళశారం విచారణ జరిపింది. ఈ విషయమై విచారణ చేసిన కోర్టు ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 8వ తేదీన భువనగిరి పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు నుండి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొనున్నారు.

Court Orders to Marri Srinivas Reddy Police Custody