Home తాజా వార్తలు కన్నడ నటి శ్రుతికి కోర్టులో ఎదురుదెబ్బ

కన్నడ నటి శ్రుతికి కోర్టులో ఎదురుదెబ్బ

Sruthi-And-Arjun-Sarjaబెంగళూరు: మీ టూ కేసులో ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దాఖలు చేసిన పరవునష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ కన్నడ నటి శ్రుతి హరిహరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జిపిఓ) లేకుండా అర్జున్ సర్జా మేనల్లుడు, కన్నడ నటుడు ధ్రువ సర్జా తనపై పరువునష్టం దావా వేశారని, దీన్ని రద్దు చేయాలని శ్రుతి వాదించగా ఇటువంటి చిన్న లీగల్ తప్పును సరిచేయవచ్చని సివిల్ కోర్టు జడ్జి సువర్ణ మిర్జీ స్పష్టం చేశారు. ఈ చిన్న కారణంగా పిటిషన్‌ను తిరస్కరించలేమని ఆమె తెలిపారు.

మీ టూ ఉద్యమంలో ఉధృతంగా ఉన్న తరుణంలో గత ఏడాది అక్టోబర్‌లో విస్మయ అనే కన్నడ చిత్రం షూటింగ్ సందర్భంగా అర్జున్ సర్జా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ శ్రుతి ఆరోపించింది. అంతేగాక అర్జున్‌పై కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలను ఖండించిన అర్జున్ ఆమెపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో రూ.5 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఆయన తరఫున ధ్రువ సర్జా ఈ దావా వేశారు.

Court rejects Sruthis plea to dismiss defamation case, Sandalwood actress Sruthi Hariharan filed a petition seeking to quash the defamation proceedings filed against her by actor Arjun Sarja in the Me Too case