Home తాజా వార్తలు పోక్సో కేసులో ఆరేళ్ల జైలు

పోక్సో కేసులో ఆరేళ్ల జైలు

pocso-act
తీర్పు చెప్పిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన మారుతండ్రికి ఆరేళ్ల జైలు, రూ.1,000 జరిమానా విధిస్తూ నాంపల్లి చైల్డ్ ఫ్రెండ్లీకోర్టు శనివారం తీర్పు చెప్పింది. మంగల్‌హాట్‌కు చెందిన బాలికపై ఆమె మారు తండ్రి అత్యాచారం చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాక్షాలు సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్షాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడికి శిక్ష పడేలా చేసిన కేసు దర్యాప్తు అధికారులకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అవార్డులు అందజేశారు.

Court sentenced accused to 6 years in pocso case