Friday, April 19, 2024

‘శేఖర్’ మూవీ ప్రదర్శన నిలిపివేత.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?

- Advertisement -
- Advertisement -

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ మూవీ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, విడుదలైన రెండవ రోజే ఈ చిత్ర ప్రదర్శనను థియేటర్లలో నిలిపివేశారు. దీనికి కారణం ఈ సినిమా నిర్మాణం నిమిత్తం దర్శకురాలు జీవితా రాజశేఖర్.. రూ.64 లక్షలు తన వద్ద తీసుకొని సినిమా విడుదలైనా కూడా తిరిగి డబ్బు ఇవ్వలేదని ఫైనాన్షియర్ ఏ. పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. అనంతరం 48 గంటల్లో రూ. 64 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయకపోతే.. అన్ని ఫ్లాట్ ఫామ్స్‌లో ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోర్టు ఆర్డర్ చేసినట్లుగా పరంధామ రెడ్డి ఓ నోటీసును విడుదల చేశారు. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం నుండి థియేటర్లలో ‘శేఖర్’ సినిమాని నిలిపివేశారు.

దీంతో ‘శేఖర్’ చిత్ర టీమ్ కూడా కోర్టుని ఆశ్రయించింది. ఇక మంగళవారం నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ..“నా పేరు మీదే శేఖర్ సినిమా టైటిల్ సహా అన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి. సెన్సార్ సర్టిఫికేట్ సైతం నిర్మాతగా నా పేరు మీదే ఉంది. శివాని, శివాత్మిక పేరు వారు ఇష్టపడి వేసుకున్నారు. లీగల్‌గా మాత్రం అన్నీ నా పేరునే ఉన్నాయి. సినిమా ప్రదర్శనలను కోర్టు ఆపమనలేదు. సినిమా రైట్స్.. ఎటాచ్‌మెంట్ చేయమని కోర్టు చెప్పింది. అయినా క్యూబ్, యూఎఫ్‌ఓలు ప్రదర్శనలు ఆపాయి. గరుడ వేగ సినిమాకు నేను ఫైనాన్సియర్‌ని. జీవితా, ఆ చిత్ర నిర్మాతలకు మధ్య ఏం జరిగిందనేది నాకనవసరం. నాకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారు..?, బాధ్యులపై చట్టపరమైన చర్యలకు వెళ్తాను. మళ్ళీ ‘శేఖర్’ సినిమా ప్రదర్శనలపై నేను నిర్ణయం తీసుకోలేదు. శేఖర్ సినిమాకు నేను రూ.15 కోట్లు బడ్జెట్ పెట్టాను. నాకు డిజిటల్ పార్ట్‌నర్స్, పరంధామ రెడ్డి వల్ల జరిగిన నష్టంపై క్లారిటీ ఇవ్వాలి. నష్టంపై క్లారిటీ వచ్చిన తర్వాతే ‘శేఖర్’ సినిమా ఓటీటీకి అమ్ముతాను”అని అన్నారు.

Court Stops ‘Shekar’ Movie Screening in Theaters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News