Home Default రాధేమాకు మరో షాక్!

రాధేమాకు మరో షాక్!

Radhe-Maa

న్యూఢిల్లీ : వివాదాస్పద ఆధ్యాతిక గురువు, స్వయం ప్రకటిత దైవ స్వరూపిణి రాధేమాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవపర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదుచేయాల్సిందిగా ఇటీవల పంజాబ్‌-హరియాణా హైకోర్టు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా తనపై నమోదైన గృహహింస, లైంగికదాడి కేసు నుంచి తన పేరును తొలగించాలని రాధేమా కోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను విచారించిన స్థానిక  బోరివలి కోర్టు.. రాధేమా చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.