Home తాజా వార్తలు దారికాచి… కత్తులతో వెంటాడి చిన్నమ్మ కుమారుడి హత్య

దారికాచి… కత్తులతో వెంటాడి చిన్నమ్మ కుమారుడి హత్య

నల్లగొండ: పెద్దమ్మ కొడుకులు ఓ యువకుడిని దారికాచి కత్తులతో వెంటపడి అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మచ్చ శ్రీకాంత్ (22) అనే యువకుడు మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో నివసిస్తున్నాడు. నిడమనూరు మండలం రేగుల గడ్డలో తన అమ్మమ్మ దశదిన కర్మకు హాజరైన అనంతర తన అత్త మామాలతో కలిసి ఇంటికి వస్తున్నాడు. దారి మధ్యలో శ్రీకాంత్ బైక్‌ను కారుతో ఢీకొట్టారు. శ్రీకాంత్ కింద పడిపోగానే కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పటికే శ్రీకాంత్ వారి నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ శ్రీకాంత్ చుట్టుముట్టి వేట కోడవళ్లతో కిరాతకంగా మెడపై నరికారు. ఘటనా స్థలంలోనే శ్రీకాంత్ చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సిఐ వీర రాఘవులు, ఎస్‌ఐ కొండల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీకాంత్ అత వీరమ్మ, మామ వెంకటయ్య ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పెద్దమ్మ కుమారుడు ఒంగూరు మహేందర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం రోజున శ్రీకాంత్ తల్లి సంవత్సరీకం జరగనుంది. ఈ ఘటనతో కుటుంబ విషాదంలో మునిగిపోయింది. ఆధారాలు దొరక్క కుండా తమ వెంట తెచ్చుకున్న కారాన్ని శవంపై చల్లి పారిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.