Wednesday, April 24, 2024

బిటన్ స్ట్రెయిన్‌కు కొవాగ్జిన్‌తో చెక్

- Advertisement -
- Advertisement -

బిటన్ స్ట్రెయిన్‌కు కొవాగ్జిన్‌తో చెక్
ఐసిఎంఆర్ అధ్యయనంలో రుజువైనట్లు సంస్థ ట్వీట్

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో తొలుత కనిపించిన కరోనా వైరస్ స్ట్రెయిన్ చికిత్సలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సత్ఫలితాలను ఇస్తోంది. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని భారత్ బయోటెక్ బుధవారం ఓ ట్వీట్‌లో వెల్లడించింది. ఐపిఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టు నిర్వహించిన ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్ టెస్ట్ (పిఆర్‌ఎన్‌టి50)లో ఇది వెల్లడైనట్లు తెలిపింది. యుకె వేరియంట్ స్ట్రెయిన్ చికిత్సకోసం కొవాగ్జిన్ స్వీకరించిన వారినుంచి సేకరించిన సెరా(రసి)ని ఈ పరీక్షల్లో వినియోగించినట్లు తెలిపింది. ఈ ట్వీట్‌తో పాటుగా ఆ అధ్యయనం వివరాలను తెలిపే నివేదికను కూడా జత చేసింది. ప్రయోగ శాలలో అభివృద్ధిపరిచే కల్చర్డ్ సెల్‌కు ఇన్‌ఫెక్షన్ సోకకుండా నిరోధించే, మట్టుబెట్టే యాంటీబాడీలను కొలిచే పద్ధతి ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్ టెస్ట్ అంటారు. బయోఆర్‌ఎక్స్ ఐవి ప్రీప్రింట్ వెర్షన్‌లో ప్రచురితమైన డాక్యుమెంట్ ప్రకారం యుకె వేరియంట్‌పైన, విధర్మ (హెటిరోలోగస్) స్ట్రెయిన్‌పైనా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సెరా న్యూట్రలైజేషన్ యాక్టివిటీని పోల్చినప్పుడు ఒకేవిధమైన సామర్థాన్ని చూపించడంతో న్యూట్రలైజేషన్ ఎస్కేప్ అవకాశాలకు సంబంధించి అనిశ్చితిపై అనుమానాలు నివృత్తి అయ్యాయి.

ఈ అధ్యయనంపై పీర్ రివ్యూ జరగాల్సి ఉంది. భారత దేశానికి బ్రిటన్‌నుంచి వచ్చిన వారినుంచి ఎన్‌ఎఆర్‌ఎస్‌సిఒవి2ను యుకె వేరియంట్‌కు చెందిన అన్ని సిగ్నేచర్ మ్యుటేషనతో విజయవంతంగా వేరు చేసి, నిర్ధారించడంలో విజయం సాధించామని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త పేర్కొన్నారు. రెండోదశ కొవాగ్జిన్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న 38మందినుంచి సెరీఆను సేకరించి పరీక్షించినట్లు ఈ వ్యాస రచయితలు పేర్కొన్నారు. కొవాగ్జిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. దీనిని ఎమర్జెన్సీ వినియోగం కోసం డ్రగ్ రెగ్యులేటర్ అనుమతించిన విషయం తెలిసిందే.

Covaxin effective on UK Strain of Corona: ICMR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News