Friday, April 26, 2024

పటియాలా లా యూనివర్శిటీలో కరోనా కలకలం

- Advertisement -
- Advertisement -

Covid-19 excitement at Patiala Law University

దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు

న్యూఢిల్లీ : పంజాబ్ లోని పటియాలాకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా (ఆర్‌జీఎన్‌యూ) లో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ 60 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆ యూనివర్శిటీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. బాధితుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. దాన్ని ప్రత్యేక గదుల్లో ఐసొలేషన్ లో ఉంచినట్టు తెలిపారు. మరోపక్క ఐఐటీ మద్రాస్‌లో ఇటీవల పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకింది. ప్రస్తుతం అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య 170 కి చేరింది. ఇదిలా ఉండగా, బుధవారం దేశ వ్యాప్తంగా 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 3275 మంది వైరస్ బారిన పడ్డారని కేంద్రం వెల్లడించింది.

ముందు రోజు కంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 1354 మందికి వైరస్ సోకగా, పాజిటివిటీ రేటు 7.64 శాతానికి పెరిగింది. ముంబైలో 117 కేసులు రాగా, ఫిబ్రవరి 24 తర్వాత ఇవే అత్యధికం కావడం గమనార్హం. బుధవారం 3010 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా కొనసాగుతోంది. క్రియాశీల కేసులు 19,719 ( 0.05 శాతం పెరిగాయి., 24 గంటల వ్యవధిలో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్లకు పైగా కేసులు రాగా, 5.28 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. వైరస్ కట్టడికి ప్రారంభించిన టీకా కార్యక్రమంలో 189 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం 13.98 లక్షల మంది టీకా వేయించుకున్నారని కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News