Friday, March 29, 2024

ఈ ఏడాది హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు : డబ్ల్యుహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

COVID-19 Herd Immunity unlikely in 2021 despite Vaccines

 

జెనీవా : ప్రపంచంలో అనేక దేశాలు కరోనా టీకా కార్యక్రమం చేపట్టినప్పటికీ ఈ ఏడాది హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్య స్వామినాధన్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ రేటు దాదాపు 70 శాతం సాధిస్తేనే కానీ హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడ్డారు. అలా జరిగితేనే మొత్తం జనాభా కరోనా నుంచి రక్షణ పొందగలుగుతారని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో స్వామినాధన్ మాట్లాడుతూ బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ తదితర దేశాలన్నీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాయని, వైరస్‌కు గురయ్యే వారికి వ్యాక్సిన్ల వల్ల రక్షణ కలుగుతున్నప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే స్థాయి ఇప్పట్లో సమకూరదని చెప్పారు. డబ్ల్యుహెచ్‌ఒ అడ్వైజర్ డాక్టర్ బ్రూస్ అయిల్వర్డ్ కరోనా వ్యాక్సినేషన్లు కొన్ని పేద దేశాల్లో ఈనెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభమౌతాయని ఆశిస్తున్నామని, అయితే అన్ని దేశాలకూ, అందరికీ వ్యాక్సిన్ అందేలా ప్రపంచ సమాజం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల సహకారం అవసరమని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News