Thursday, April 25, 2024

డెల్టాతో జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

Covid-19 is under control in Telangana

భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వేరియెంట్ తీవ్ర ప్రభావం
ఈ వైరస్ శరీరం మీద ఎక్కువగా ఉండే అవకాశం

 కేరళలో ప్రస్తుతం 50% డెల్టా కేసులు
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది
సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదు
అజాగ్త్రత కొనసాగితే థర్డ్‌వేర్ ముప్పు
పాజిటివ్‌లు బయట తిరుగుతున్నారు
రాష్ట్రంలో ఇప్పటికే 2డెల్టా కేసులు
మొదటి టీకా డోసు కోటి 12లక్షల మందికి ఇచ్చాం, వారికి సెకండ్ డోసు ఇస్తున్నాం
టీకా తీసుకొన్న వారికే మాల్స్, సినిమా హాల్స్‌లో ప్రవేశాన్ని పరిమితం చేసే సూచన
– డిఎంహెచ్‌ఒ శ్రీనివాస రావు

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతానికి కరోనా అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్య సంచాలకుడు జి. శ్రీనివాస రావు తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపిందని, ఈక్రమంలో మనదేశంలోని కేరళలో 50 శాతం డెల్టా కేసులన్నాయన్నారు. శరీరంపై ఎక్కువకాలం డెల్టా వైరస్ ప్రభావం చూపుతోందని, రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదన్నారు. ఇలాగే కోనసాగితే థర్డ వేవ్‌కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఫస్ట్ డోస్ కోటి 12 లక్షల మందికి ఇచ్చామని, ప్రస్తుతం సెకండ్ డోస్ వారికి ఇస్తున్నామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమేమాల్స్, సినిమా హల్స్‌లోకి ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్ తీవ్రత అధికంగా ఉందని వెల్లడించారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. మానవ శరీరంపై డెల్టా వైరస్ ప్రభావం ఎక్కువ కాలం ఉండటంతో ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని ఈ రకం వైరస్‌లో గుర్తించామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 2 డెల్టా ప్లస్ కేసులు..

“రాష్ట్రంలో 2 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని డిహెచ్ వివరించారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ ఇంకా పూర్తిగా తగ్గలేదని, ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 9 జిల్లాల్లో ఎక్కువగా కేసులుడెల్టా వైరస్‌లో ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. కరోనా రెండో దశ ఇంకా పూర్తిగా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయని, ఈక్రమంలో ఖమ్మం జిల్లా కూసుమంచిలో భారీగా కేసులు నమోదైన ఘటనలు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో కరోనా మూడో దశకు మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో 2.2 కోట్ల మంది వ్యాక్సినేషన్‌కు అర్హులు కాగా ఇప్పటివరకు 1.12 కోట్ల మందికి ఓ డోసు వ్యాక్సిన్ ఇచ్చామని, 33.79 లక్షల మందికి రెండు డోసులు వేశామన్నారు. కేంద్రం నుంచి అదనంగా 9.5 లక్షల డోసులు వచ్చాయని, ఒకట్రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తామన్నారు. కరోనా మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని, ప్రభుత్వ దవాఖానల్లో 26 వేల ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.. పిల్లల కోసం జిల్లా దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News