Thursday, April 25, 2024

వరుస పండగలతో తప్పదు థర్డ్‌వేవ్….

- Advertisement -
- Advertisement -

Covid-19 Third wave with consecutive festivals

వచ్చే నాలుగు వారాలే అత్యంత కీలకం
ఒమిక్రాన్ విజృంభణ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వైరస్ సోకిన వారిలో 10 శాతం మందికే లక్షణాలు
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యాధికారుల హెచ్చరికలు

హైదరాబాద్: నగరంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో వచ్చే నాలుగు వారాలు అత్యధిక కీలకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్షం చేస్తే మూడో వేవ్ తప్పదని, ప్రస్తుతం పలు దేశాల్లో ఈకేసులు పెరుగుతున్నాయని, దీంతో మరో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన రెండు వేవ్‌లను సమర్దంగా ఎదుర్కొని వైరస్ వ్యాప్తించకుండా జాగ్రత్తలు చేపట్టాం. ఈసారి కూడా అదే విధంగా ప్రజలు నిర్లక్షం చేయకుండా వైద్యుల సూచనలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు. ఇప్పటివరకు నమోదైన 62 ఒమిక్రాన్ కేసుల్లో 39 వరకు గ్రేటర్‌నగరానికి చెందినవేనని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈవేరియంట్ డేల్టా వేరియంట్ కంటే ఆరు రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం 30 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని తేల్చినట్లు వెల్లడిస్తున్నారు. వరుస వేడుకలు, పండగలతో ప్రమాదముందని, నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు అర్భాటం చేయవద్దని, అదే విధంగా సంక్రాంతి పండుగ కూడా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని బంధుమిత్రులతో చేసుకుంటే మహమ్మారి విజృంభిస్తుందని వైద్యులు అంటున్నారు. కేసులు పెరుగుదల ఉన్నప్పటికి పెద్దగా ఆందోళన అవసరం లేదని, టీకా తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. ప్రతి ఒకరు మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలి. ఇంతకుముందు ఎప్పుడు చూడనంతగా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని, వైరస్ సోకిన వారిలో 90శాతం మందిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంలేదు. కేవలం 10శాతం మంది మాత్రమే వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

కొవిడ్ నిబంధనలు పాటించకుంటే జరిమానాలు వేసి కొంతమంది మాల్స్, షాపింగ్, మార్కెట్‌ల్లో ఇష్టానుసారంగా తిరుగుతుండటంతో వైరస్ పుంజుకుంటుందని, దుకాణాల యాజమానులు నిబంధనలు పాటించేవారనే లోపలికి అనుమతి ఇవ్వాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా మహానగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ గత మూడు రోజుల నుంచి 100 నుంచి 130వరకు నమోదైతున్నాయి. అదే విధంగా వ్యాక్సిన్ పంపిణీ కూడా దాదాపు పూర్తి అయిందని, వచ్చే నెలల్లో 15నుంచి 18 ఏళ్ల లోపు వారికి టీకా వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య పేర్కొనడంతో చిన్నారులకు వీలైనంత త్వరగా వేయించాలని వైద్యులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News