Friday, March 29, 2024

నిరాఘాటంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -

Covid-19 vaccination continues in telangana

అర్హులైన అందరికీ టీకాలు ఇచ్చేలా వైద్యారోగ్యశాఖ చర్యలు
4,33,84,319 వ్యాక్సిన్ డోసుల వ్యాక్సిన్లు పంపిణీ పూర్తి

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ టీకాలపై ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలతో ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోని వారు కూడా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగుతోంది. శనివారం నాటికి తెలంగాణలో 4,33,84,319 వ్యాక్సిన్ డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన వారిలో 2,72,24,308 మందికి మొదటి డోసు అందగా, 1,61,60,011 మందికి రెండు డోసులు అందించినట్లు పేర్కొంది.

డిసెంబర్ 31 నాటికి 100 శాతం వ్యాక్సినేషన్

కరోనా కట్టడికి ప్రధాన అస్త్రమైన టీకా పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుని మరీ వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్ధేశనం చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూనే వీలైనంత త్వరగా అర్హులైన అందరికీ టీకాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. మొదటి విడతలో వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉన్నవారికి వ్యాక్సినేషన్ ఇచ్చి, ఆ తర్వాత 18 ఏళ్లు పై బడిన వారికి టీకాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. జనాభా ప్రాతిపదికన చూసినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా టీకాలు అందించింది. మొదటి డోసు తీసుకుని రెండవ డోసు తీసుకోని వారిని, ఇప్పటివరకు మొదటి డోసు కూడా తీసుకోని వారిని గుర్తించి వారందకీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఒమిక్రాన్ భయంతో పెరిగిన వ్యాక్సినేషన్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం, దాంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద నిత్యం రద్దీ నెలకొంటుంది. దాంతోపాటు ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి ఇంటింటికీ వెళ్లి మరీ ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వేస్తున్నారు. భవిష్యత్తులో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, సినిమా హాళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించింది. ఎప్పిటికప్పుడు అందరికీ అందరికీ అవగాహన కల్పిస్తూ మరింత ఉధృతంగా వ్యాక్సినేషన్ చేపట్టేలా చర్యలు చేపడుతోంది. డిసెంబర్ 31 నాటికి తెలంగాణలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా ఆరోగ్య శాఖ అన్ని విధాలా సర్వశక్తులు ఒడ్డుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News