Tuesday, November 28, 2023

27 నుంచి ఇజ్రాయెల్‌లో వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -

Covid-19 Vaccination in Israel from Dec 27

అబుధాబి: ఈ నెల 27 నుంచి ఇజ్రాయెల్‌లో కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రారంభమౌతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ప్రజలకు వ్యాక్సినేషన్ అందించే మొదటి దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి కానున్నది. చైనా కరోనా వ్యాక్సిన్ పరీక్షలో 86 శాతం సామర్థం ఉందని వెల్లడైందని అరబ్ ఎమిరేట్స్ బుధవారం వెల్లడించిన తరువాత ఈ ప్రకటన రావడం గమనార్హం. బుధవారం నెతన్యాహు ఫైజర్ వ్యాక్సిన్ డోసులు నౌకలో మొదటి కోటాగా రావడాన్ని స్వాగతించారు. మరికొద్ది రోజుల్లో వేలాది డోసులు అదనంగా సమకూరతాయన్న ఆశాభావం వెలిబుచ్చారు. డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్‌లో రోజుకు 60 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడమౌతుందని చెప్పారు. తొమ్మిది మిలియన్ జనాభా ఉన్న దేశంలో ఈ సంఖ్య పెద్దదిగా పేర్కొన్నారు.

Covid-19 Vaccination in Israel from Dec 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News