Friday, April 19, 2024

టీకాలు పుష్కలం.. ఇక రెండో డోసు పంపిణీ అవసరం

- Advertisement -
- Advertisement -
Covid-19 vaccine coverage in India
కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచన

న్యూఢిల్లీ : : దేశం మొత్తం మీద కొవిడ్ టీకా వంద కోట్ల డోసుల పంపిణీకి చేరువవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం టీకా డోసులు అందుబాటులో ఉన్నందున రెండో డోసు పంపిణీ కూడా పూర్తి చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముమ్మరంగా ప్రయత్నం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు టీకా డ్రైవ్‌లో దేశం మొత్తం మీద టీకా డోసుల పంపిణీ 99 కోట్ల మార్కును దాటింది. గత జనవరి 16 న ప్రధాని మోడీ కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈమేరకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు ఎలా ఉండాలో సూచించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. వ్యాక్సినేషన్ పురోగతిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్త్ సెక్రటరీలు, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, సోమవారం సమీక్షించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

వందకోట్ల డోసుల పంపిణీకి చేరువలో ఉండడానికి కృషి చేసిన రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను భూషణ్ అబినందించారు. చాలా రాష్ట్రాల్లో రెండో డోసు కోసం నిరీక్షిస్తున్న వారికి రెండో డోసు అందించడానికి కావలసిన డోసులు కూడా ఉన్నాయని వర్చువల్ సమావేశంలో ప్రస్తావించారు. ఈమేరకు ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా డోసులు సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈమేరకు రాష్ట్రాలు లక్షాలను పూర్తి చేయవచ్చని సూచించారు. వ్యాక్సినేషన్ తక్కువ స్థాయిలో ఉన్న జిల్లాలను గుర్తించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవసరం మేరకు వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచాలని, అక్కడ స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిగణన లోకి తీసుకుని వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా సాగేలా చూడాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News