Thursday, April 25, 2024

సెప్టెంబర్‌లోనే వ్యాక్సిన్ వచ్చేస్తోంది!

- Advertisement -
- Advertisement -
Covid-Vaccine
అమెరికా బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా ప్రకటన

న్యూయార్క్: ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సీన్ కనుగొనే క్రమంలో భారీ ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు పూర్తిగా సహకరిస్తామని బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. మూడో దశ పరీక్షలకోసం పరిశోధకులకు సహకరిస్తామని పేర్కొంది. 40 కోట్ల డోసుల వ్యాక్సీన్ తయారీకి ఒప్పందం ఖరారైందని..మొత్తం వంద కోట్ల డోసులను తయారు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఆస్ట్రాజెనెకా గురువారం ప్రకటించింది.

సెప్టెంబర్‌లోనే తొలి విడత వ్యాక్సీన్ సరఫరాలను చేపడతామని, వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ, సరఫరా కోసం అమెరికన్ బయోమెడికల్ పరిశోధన అభివృద్ధి సంస్థ (బిఏఆర్‌డిఏ) నుంచి తమకు వంద కోట్ల డాలర్ల నిధులు మంజూరయ్యాయని సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేపట్టే మూడోవిడత క్లినికల్ ట్రయల్స్‌కు కంపెనీ సహకరిస్తుందని ఆస్ట్రాజెనెకా తెలిపింది. 30,000 మందిపై వ్యాక్సీన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారని వెల్లడించింది. ఈ వ్యాక్సీన్‌ను అతి త్వరగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో తాము కలిసి పనిచేస్తామని కంపెనీ సిఈఓ పాస్కల్ సోరియట్ వెల్లడించారు.

Covid 19 Vaccine is coming in September

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News