Thursday, April 25, 2024

నిజామాబాద్ ఘటనపై డిఎంఇ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Covid Dead Body Carried in Auto at Nizamabad

నివేదిక సమర్పించిన ఆసుపత్రి సూపరింటెండెంట్
ఆటోలో కరోనా మృతదేహాన్ని తరలించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
కోవిడ్ నిబంధనలు పాటించాలని మరోసారి హెచ్చరిక

హైదరాబాద్: నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్‌తో మృతిచెందిన వ్యక్తి శవాన్ని ఆటోలో తరలించిన సంఘటనపై డిఎంఇ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్) డా రమేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కమిటీ ద్వారా నివేదికను తెప్పించుకొని పరిశీలించారు. కరోన మృతదేహాలను ఇచ్చిన సిబ్బందిపై, ఆటోలో తరలించిన వారిపై కేసులు పెట్టాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా, విచారణ కమిటీ మధ్యంతర నివేదిక ప్రకారం.. శుక్రవారం నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో మూడు కోవిడ్, ఒక సాధారణ మరణాలు చోటుచేసుకున్నాయని సూపరింటెండెంట్ తెలిపారు.

కోవిడ్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత మార్చురీ సిబ్బంది డిస్పోజల్స్‌లో శవాలను ఉంచడం జరిగిందని ఆసుపత్రి అధికారి డిఎంఇకి తెలిపారు. అయితే హాస్పిటల్ అధికారులు కోవిడ్ కేసుల నిర్వహణ హడావిడిలో ఉన్న తరుణంలో,మార్చురీ నుండి మొదట రెండు శవాలను అంబులెన్సులలో పంపడం జరిగిందని నివేదికలో తెలిపారు. మిగిలిన రెండిటికోసం అంబులెన్సులు వచ్చేలోపు భీంగల్ నివాసికి సంబంధించిన శవం బంధువులు తమ స్వంత ఆటో ఉందని, శవాన్ని నిజామాబాద్ లోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని మార్చురీ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి తీసువెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సూపరింటెండెంట్ తెలిపారు.

ఆ తర్వాత నిజామాబాద్ లోని ఒక స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఇప్పటికే మార్చురీ సిబ్బందికి తాఖీదులు జారీ చేశామని, పూర్తి నివేదిక అందిన తరువాత సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ చెప్పారు. ఇక ముందు ఇలాంటి తప్పిదాలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని హాస్పిటల్ సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. అనంతరం అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని డిఎంఇ డా రమేష్‌రెడ్డి మరోసారి హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News