Thursday, March 28, 2024

లైఫ్ లైన్ ఆసుపత్రి అరాచకం…రూ.2 లక్షలు కట్టి మృతదేహం తీసుకెళ్లండి…

- Advertisement -
- Advertisement -

Covid patient dead in Life line hospital

 

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా కాప్రాలో కరోనాతో చనిపోయిన మృతదేహానికి డబ్బులు కట్టే వరకు మృతదేహం ఇచ్చేది లేదని కాప్రా లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్యం ఆ పేద కుటుంబ సభ్యులను వేధిస్తుంది. ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పిన సంఘటన కాప్రాలోని పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న లైఫ్ లైన్ ఆసుపత్రిలో జరిగింది. శవాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్న ఆసుపత్రి యాజమాన్యం పట్టించుకోవడంలేదు. ఇప్పటికే సుమారు లక్షన్నర రూపాయలు చెల్లించినా ఇంకా 2 లక్షలు చెల్లించి మృత దేహాన్ని తీసుకెళ్లాలని యాజమాన్యము మొండికేసింది. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. మృతుడు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి కి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అని తెలిపారు.  నిరుడు వాసుకు గత 5 రోజుల క్రితం కరోనా వైరస్ తో బాధపడుతూ కాప్రా లోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో చేరాడు. మున్సిపల్ వాసులు అందరు తరలి వస్తుండడంతో కొద్ది సేపట్లో ఆసుపత్రి వద్ద ధర్నా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News