Home జాతీయ వార్తలు వంద కోట్ల టీకా డోసుల పండగ

వంద కోట్ల టీకా డోసుల పండగ

Covid vaccine doses administered in india cross 100 cr

 

వారసత్వ కట్టడాలకు జాతీయ పతాక వర్ణాల వెలుగులు

న్యూఢిల్లీ : వంద కోట్ల కరోనా డోసుల రికార్డును భారత్ ఘనంగా జరుపుకుంటోంది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం , ప్రధాని మోడీ, బిజెపి వర్గాలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పురావస్తుశాఖ కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుంటోంది. వంద కోట్ల డోసులకు సూచనగా వంద వారసత్వ కట్టడాలకు జాతీయ పతాక వర్ణాల వెలుగుతో నింపేయాలని నిర్ణయించింది. గురువారం పురావస్తుశాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్, శాస్త్రవేత్తలు, టీకా తయారీ దారులు, దేశ పౌరుల కృషికి ఈ విధంగా అభినందనలు తెలియచేయనున్నది.

జాతీయ జెండా రంగులు విరజిమ్మే కట్టడాల జాబితాలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన 17 కట్టడాలున్నాయి. వాటిలో కొన్ని ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమాయున్ టాంబ్, తుగ్లకాబాద్ ఫోర్ట్, పురానా ఖిల్లా, ఫతేపూర్ సిక్రీ, రామప్ప ఆలయం, హంపి, డోలవీర పురాతన లేహ్ ప్యాలెస్, మనదగ్గర హైదరాబాద్ లోని గోల్కొకాండ కోటపై కూడా ఈ రంగులు ప్రదర్శించనున్నారు. వంద కోట్ల డోసుల పంపిణీని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే దీన్ని చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మనదేశంలో జనవరి 16 న కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. నేటికి వంద కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. తొమ్మిది నెలల వ్యవధిలో భారత్ దీన్ని సాధించ గలిగింది.

Covid vaccine doses administered in india cross 100-cr mark