Friday, April 19, 2024

రౌడీషీటర్‌పై పిడి యాక్ట్

- Advertisement -
- Advertisement -

CP Anjani Kumar issued orders imposing a PD Act on rowdy sheeter

ఉత్తర్వులు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : హత్యలు, దోపిడీలు చేస్తూ అలజడి సృష్టిస్తున్న రౌడీషీటర్‌పై పిడి యాక్ట్ పెడుతూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఆయుబ్ బిన్ అల్‌వీస్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడిపై చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. నిందితుడు తన సహచరులతో కలిసి దొంగతనాలు, హత్యలు చేస్తున్నారు. ఇంతే కాకుండా చాలామందిని బెదిరిస్తున్నాడు. చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా, తాజాగా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News