Saturday, April 20, 2024

ఉమెన్ పోలీసులు అదనపు బలం

- Advertisement -
- Advertisement -

CP Anjani Kumar meeting with City Women Police

నగర ఉమెన్ పోలీసులతో సమావేశమైన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్ : మహిళా పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులకు అదనపు బలమని నగర పోలీస్ కమిషర్ అంజనీకుమార్ అన్నారు. పేట్లబుర్జులోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వులో గురువారం ఆయన నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో ఉమెన్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని సిపి అంజనీకుమార్ అన్నారు. కీలక సమయంలో సీనియర్ పోలీసు అధికారులను సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ పోలీసులు ఉమెన్ పోలీసులను గౌరవిస్తారని తెలిపారు. ఉమెన్ పోలీసులకు మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో సౌత్‌జోన్ డిసిపి గజారావు భూపాల్, డిసిపి సునీతా రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలు, హెచ్‌సిలు, పిసిలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News