Home తాజా వార్తలు పోలీసులకు కెపిఐ అవార్డులు

పోలీసులకు కెపిఐ అవార్డులు

CP Stephen Ravindra presenting KPI awards to police
అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: పోలీసులు సమాజానికి మంచి సర్వీస్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 254 మంది పోలీసులకు కెపిఐ అవార్డులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ పోలీసులు చాలా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మొదటగా స్పందించేవారు పోలీసులేనని అనానరు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పోలీసులు ప్రజలకు మంచి సర్వీసు ఇచ్చేందుకు ప్రయత్నించాలని అన్నారు. సీనియర్ సిటీజన్లు, మహిళలు, పిల్లలు, పేదలకు సాయం చేసేందుకు ముందుండాలని అన్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ కారు, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, ఇన్వెస్టిగేషన్, ఎస్‌హెచ్‌ఓలు, డిఐ, డిఎస్సైలు, సెక్షన్, అడ్మినిస్ట్రేషన్, క్రైం రైటర్స్ జనవరి నుంచి మే 2021వ రకు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో డిసిపిలు రోహిణిప్రియదర్శిని, విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.