Home జాతీయ వార్తలు సిపిఎం నేత మధు అరెస్టు

సిపిఎం నేత మధు అరెస్టు

CPI (M) Leader Madhu Arrested at Guntur

గుంటూరు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును గురువారం పోలీసులు అరెస్టు చేశారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి సంఘటనకు సంబంధించి కొందరిపై పోలీసులు కేసు పెట్టారు. ఈ ఘటనలో అమాయకులైన బాధితులను పరామర్శించేందుకు మధు గుంటూరులో పర్యటించారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధును అరెస్టు చేసిన క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేశారు. ఈ ఘటనలో ఓ యువకుడు స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలిఒంచారు. అరెస్టు అయిన మధుతో పాటు ఇతర వామపక్ష నేతలను నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగరంలో సెక్షన్ -30,144 అమల్లో ఉన్నందున సభలకు , సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

CPI (M) Leader Madhu Arrested at Guntur