Home Default హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు సిపిఐ మద్ధతు

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు సిపిఐ మద్ధతు

CPI Leader Chada Venkat Reddy

 

హైదరాబాద్‌: హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు సిపిఐ మద్ధతు తెలుపున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్‌ ఎంపిలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ క్రమంలోనే తాము టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సిపిఐ కార్యకర్తలు, అభిమానులు టిఆర్ఎస్ కే ఓటేయాలని ఆయన కోరారు.

CPI Support to TRS Party In Huzurnagar bypoll