Thursday, April 25, 2024

పశ్చిమబెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్‌తో సిపిఎం పొత్తు

- Advertisement -
- Advertisement -

CPM alliance with Congress for West Bengal elections

 

సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం వెల్లడి

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శనివారం వెల్లడించారు. తమిళనాడు, కేరళ, అసోంల్లో సెక్యులర్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడమౌతుందని చెప్పారు. ఈనెల 30,3న వర్చువల్ సమావేశాలు నిర్వహించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. కేరళలో ఎల్‌డిఎఫ్‌లో భాగంగా పార్టీ పోటీ చేస్తుందని, తమిళనాడులో డిఎంకెతో ,అసోంలో అన్ని సెక్యులర్ విపక్షాలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం, లెఫ్ట్‌ఫ్రంట్ ఒక అవగాహనకు వచ్చి కాంగ్రెస్‌తో సహా సెక్యులర్ పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకుని పోటీ చేయడమౌతుందని, బిజెపి, టిఎంసిని ఓడించడమే లక్ష్యమని ఏచూరి పేర్కొన్నారు. మోడీప్రభుత్వ తిరోగమన విధానాలపై పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. నవంబర్ 2627తేదీల్లో రైతుల ఆందోళనకు, నవంబర్ 26న జాతీయ స్థాయి సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునివ్వడంపై సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News