మన తెలంగాణ/మెదక్ క్రైం : పట్టణంలో నత్తనడకన జరుగుతు న్న రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కేవ ల్‌కిషన్ భవనంలో సిపిఎం పార్టీ జిలాల్ కమిటీ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో రోడ్డు, డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతుండంతో ట్రాఫిక్ స మస్య పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొ న్నారు. జిల్లా పాలనాధికారి కేటాయించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నాచారు. వెంటనే పాలనాధికారిని నియమిం చాలని, జిల్లాలో కొనసాగుతున్న పనుల్లో వేగవంతం పెంచాలని ఆ యన కోరారు. కలెక్టరేట్ నుంచి గంగినేని థియేటర్ వరకు డ్రైనేజీ పనులు పూర్తి అయినప్పటికీ రోడ్డు పనులు పూర్తి చేయకపోవడం వలన ప్రయాణికులు, వాహనదారులు, దుమ్ము, ధూళి, గుంతల మయమైన రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అ దేవిధంగా పట్టణంలో వీధిదీపాలు పాత బస్టాండ్ నుంచి హౌసింగ్ బోర్డు, గాంధీనగర్ వరకు సక్రమంగా లేకపోవడం మూలంగా అ నేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పో స్టాఫీసు నుంచి ఏరియా ఆసుపత్రి వరకు రోడ్డు అధ్వానంగా త యారైందని, రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని వాపోయారు. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పట్టణంలోని రోడ్డు, డ్రైనేజీ పనుల్లో వే గం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నర్సమ్మ, ఎ.మహేంద్రరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సంగమేశ్వర్, బి.బస్వరాజు, కె.మల్లేశం, జి. గో టరయ్య, కె.నాగరాజు, జి.వాసు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనుల్లో వేగం పెంచాలని సిపిఎం పార్టీ డిమాండ్
- Advertisement -
- Advertisement -