Monday, July 14, 2025

సిపిఎం సీనియర్ నాయకుడు లింగంపల్లి భిక్షపతి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మరిపెడః మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు లింగంపల్లి భిక్షపతి అనారోగ్యంతో బాధపడుతు ఆధివారం మృతి చెందినట్లు మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం క్రితం అనారోగ్యానికి గురైన ఆసుపత్రిలో చేరిన భిక్షపతి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఎల్లంపేట గ్రామంలో సోమవారం అంత్యక్రియలు జరుగుతాయన్నారు. భిక్షపతి మృతి పార్టీకి తీరని లోటు అని తెలిపారు. ఆయన మృతికి మండల కమిటీ పక్షాన సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News