Saturday, April 20, 2024

ముందుగా అనుకున్న ప్రకారమే..

- Advertisement -
- Advertisement -

Crazy film in Vijay Devarakonda, Sukumar combination

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తోంది. ఈ ఆసక్తికర సినిమాపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లను చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఖండించింది. ఇవన్నీ అవాస్తవాలని… విజయ్, సుకుమార్ కాంబో సినిమా ముందు గా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించింది. ప్రస్తుతం విజయ్ ‘లైగర్‘ సినిమా చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప‘ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్‌మెంట్స్ అయిన వెంటనే విజయ్, సుకుమార్ చిత్రం ప్రా రంభం కానున్నట్లు నిర్మా ణ సంస్థ వెల్లడించింది. ఈ క్రేజీ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News