Friday, April 19, 2024

శుక్రగ్రహం గ్యాస్‌లో తిరగాడుతున్న జీవులు.?

- Advertisement -
- Advertisement -
Creatures orbiting Venus gas
జీవుల్లో మాత్రమే ఉండే ఫాస్ఫైన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు

లండన్ : ఈ భూమి మీద మినహాయించి మరెక్కడా జీవుల ఉనికిని శాస్త్రవేత్తలు ఇప్ప టివరకూ గుర్తించలేకపోయారు. అయితే, యుకెలోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు శుక్రగ్రహంపై సూక్ష్మజీవులు ఉన్నట్టుగా కొన్ని ఆనవాళ్లు లభిస్తున్నాయంటున్నారు. ఆ గ్రహం వాతావరణంలోని వా యువుల్లో సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పా టు చేసుకొని ఉండవచ్చునన్న అనుమానా లు బ్రిటన్ శాస్త్రవేత్తల నుంచి వ్యక్తమయ్యా యి.

శుక్రగ్రహం వాతావరణంలో ఫాస్ఫైన్ అణువుల్ని వారు గుర్తించారు. ఫాస్ఫైన్ అణువులు జీవుల్లోనే తప్ప సహజంగా ప్రకృతిలో లభించేవి కాదన్నది అవగాహ న. ఒక్కో ఫాస్ఫైన్ అణువులో ఒక పరమాణువు ఫాస్పరస్, మూడు పరమాణువుల హైడ్రోజన్ ఉంటుంది. మైక్రోబ్స్ అనే సూక్ష్మజీవుల్లో ఫాస్ఫైన్ అణువుల్ని భూమి మీద గుర్తించారు. ఆక్సిజన్ తక్కువగా ఉం డే పర్యావరణంలో మాత్రమే ఈ మైక్రోబ్స్ మనగలుగుతాయి. చిత్తడి నేలలు, పెంగ్విన్ పక్షుల పేగుల్లో ఇవి కనిపిస్తా యి. శుక్రగ్రహం ఉపరితలంపై 50 కి.మీ ఎత్తు వరకూ వాతావరణంలోని గ్యాస్‌లో ఫాస్పైన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

Creatures orbiting Venus gas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News