Home తాజా వార్తలు క్రికెట్ బెట్టింగ్ : ఐదుగురు అరెస్టు

క్రికెట్ బెట్టింగ్ : ఐదుగురు అరెస్టు

cricket-betting-gang-arrest

భద్రాద్రికొత్తగూడెం : జిల్లా పరిధిలోని ఇల్లందులో ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారి నుంచి రూ.19,800 నగదును, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న మరో పదకొండు మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.