Home తాజా వార్తలు హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

Cricket Betting Gang Arrested in Hyderabadహైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ ముఠాను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి రూ. 41 లక్షల నగదుతో పాటు ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై ఈ ముఠా ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహింస్తోందని పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా బిగ్‌బాస్ టి20 లీగ్‌పై కూడా ఈ ముఠా బెట్టింగ్ నిర్వహించింది. నిందితులను నగర సిపి అంజనీకుమార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు.

Cricket Betting Gang Arrested in Hyderabad