Thursday, April 25, 2024

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Cricket Betting Racket Busted in Hyderabad

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహకుడిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి టివి, తొమ్మిది మొబైల్ ఫోన్లు, రూ.32,500 స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని బేగంబజార్‌కు చెందిన విజయ్‌కుమార్ రోడ్డు ట్రాన్స్‌పోర్టులో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు కుటుంబ పోషనకు సరిపోవడంతోలేదు. దీంతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడం ప్రారంభించాడు. దాదాపు పదిహేను మంది పంటర్ల సాయంతో బెట్టి నిర్వహిస్తున్నాడు. తెలిసిన, తెలియని వ్యక్తుల నుంచి బెట్టింగ్ కోసం డబ్బులు తీసుకుని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాడు. ఐపిఎల్‌లో పలువురి వద్ద నుంచి బెట్టింగ్ కోసం డబ్బులు తీసుకుని నిర్వహిస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని గతంలో కూడా బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Cricket Betting Racket Busted in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News