Home Default హృతిక్ రోషన్‌ వీర్యం కావాలంటూ క్రికెటర్ బోల్డ్ ట్వీట్…

హృతిక్ రోషన్‌ వీర్యం కావాలంటూ క్రికెటర్ బోల్డ్ ట్వీట్…

 

ముంబయి: తనకు బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్‌ వీర్యం కావాలని ఓ మహిళా క్రికెటర్ చేసిన బోల్డ్ కామెంట్స్ సంచలనంగా మారాయి. తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన, ఇటీవల విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న వార్ సినిమా చూసిందట. అయితే, సినిమా చూసొచ్చిన తర్వాత హృతిక్ అందానికి ఫిదా అయిపోయానని, సినిమా చూస్తున్నంత సేపు కళ్లను తిప్పుకోలేకపోయానని.. హృతిక్ రోషన్‌ను అలాగే చూస్తుండిపోయానని చెబుతుంది ఈ భామ. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్‌పై అంతులేని ప్రేమను పెంచుకున్న భావన.. ఏకంగా హృతిక్ రోషన్‌తో తనకు సంతానం కావాలని, అతడిలాంటి పిల్లలు కావాలంటే అతడి స్పెర్మ్ కావాలంటూ సంచలన ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు హాట్ టాపిక్ అయిపోయింది. ఓ సినీ హీరోపై ఇంత బోల్డ్‌గా ట్వీట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. కాగా, భావన బోల్డ్ కామెంట్స్ పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన అభిమాన హీరోపై ఉన్న ప్రేమను మామూలుగా వ్యక్తపరిస్తే గుర్తింపు రాదనుకుందో ఏమో?, అందుకే ఇలా బోల్డ్ కామెంట్స్ చేేసిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్వీట్ పై హృతిక్ రోషన్ స్పందిస్తాడో? లేదో? వేచి చూడాలి.

Cricketer Bhavana Wants sperm from Hrithik Roshan