- Advertisement -
ఐపిఎల్ వల్లే క్రికెటర్లకు గాయాలు: ఆస్ట్రేలియా కోచ్ లాంగర్
సిడ్నీ: ఐపిఎల్‌లో పాల్గొనడం వల్లే భారత్‌తో సహా చాలా దేశాలకు చెందిన క్రికెటర్లు గాయాలకు గురవుతున్నారని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఆందోళన వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలం పాటు జరిగే ఐపిఎల్ వల్ల క్రికెటర్లు ఎంతో ఒత్తిడికి గురువుతున్నారన్నాడు. ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడడం వల్ల ఆటగాళ్లు పూర్తిగా అలసిపోతున్నారన్నాడు. అంతేగాక చాలా మంది గాయాలకు గురవుతున్నారన్నాడు. ఐపిఎల్ నిర్వహణను తాను తప్పుపట్టడం లేదని, అయితే డబ్బుతో పాటు విపరీత ఆదరణ లభిస్తుండడంతో చాలా దేశాలకు చెందిన క్రికెటర్లు దీనిలో పాల్గొనేందు ఆసక్తి చూపుతున్నారన్నాడు. ఇదే క్రికెటర్ల గాయాలకు కారణమవుతుందని లాంగర్ అభిప్రాయపడ్డాడు.
Cricketers have Injuries due to IPL: Aussie Coach Langer
- Advertisement -