Home Default సిసి కెమెరాలతో నేరాల నియంత్రణ : గొంగిడి సునీత

సిసి కెమెరాలతో నేరాల నియంత్రణ : గొంగిడి సునీత

Crime Control With CCTV Cameras : Gongidi Sunithaయాదాద్రి భువనగిరి : నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను సోమవారం ఆమె ప్రారంభించారు. కేసుల పురోగతితో పాటు నేర రహిత గ్రామాలుగా మార్చేందుకు సిసి కెమెరాల పాత్ర ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, చోరీలు, అనుమానాస్పద కేసుల పరిష్కారంలో సిసి కెమెరాలు ప్రయోజనకరంగా ఉంటాయని ఆమె చెప్పారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సిపి మహేశ్ భగవత్ , స్థానిక పోలీసు అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.