Home యాదాద్రి భువనగిరి నేరం…నేలవాలుతోంది

నేరం…నేలవాలుతోంది

Police2

నల్లగొండ ప్రతినిధి : గత రెండేళ్లతో పోలిస్తే నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య బా గా తగ్గుముఖం పట్టింది. నిరంతర పోలీసుల నిఘా, సాం కేతిక పరిజ్ఞాన వినియోగం, సమర్థవంతమైన నాయ క త్వం వలన పోలీస్ అప్రమత్తత పెరిగి నేరాలు తగ్గాయి. ఈ ఏడాది 2016 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం జనమైత్రి, ఫ్రెండ్లీ పోలీసులాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టగా జిల్లా పోలీసు బాసులు వాటిని సమర్థవం తంగా అమలు పరిచారు. దీంతో రోజు రోజుకు నేరాల సంఖ్య తగ్గుతుంది. జిల్లాలో 2014లో 202 నేరాలు జరుగగా, 2016లో 139 నేరాలు జరిగాయి. గ్యాంగ్‌స్టర్ నయీం ఉదంతం జిల్లాతో పాటు రాష్ట్రాన్ని కుదిపివేసింది.

నయీం ఎన్‌కౌంటర్ తర్వాత నయీం అనుచరులపై పద్నా లుగు కేసులు నమోదయ్యాయి. 51 మందిని పోలీ సులు అరెస్టు చేశారు. 14 ఆయుదాలను వారివద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆరు వాహనాలను, రూ.14, 58,800లను నయీం అనుచరుల నుండి జిల్లా పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడలోని నయీం అత్త ఇంటివద్ద 160 దస్తావేజులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నయీం అనుచరుల నుండి 160 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి రౌడి షీట్లు, పీడీ యాక్ట్‌లను అమలు చేసేందుకు జిల్లా పోలీసులు సన్నద్దమవుతున్నారు. జిల్లాలో ఐదు షీ టీమ్ లను మహిళా సీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం వల్ల మహిళలపై జరిగే నేరాలను తగ్గించగలిగారు.

మహిళా వేధింపులపై 2014లో 644 కేసులు నమోదు కాగా, 20 15లో 625, 2016లో 555 కేసులు నమోద య్యాయి. మద్యంతాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు 30 బ్రీత్ అనలైజర్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి దొరికి న వారిని సామాజిక సేవా శిక్షల ద్వారా వాహనదారు లను చైతన్యపరుస్తున్నారు. 2016 ఆగస్టు 12నుండి 23వ తేది వరకు జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా పోలీ సులు ప్రభుత్వశాఖలతో సమన్వం అవుతూ పుష్కరాల విజ యవంతానికి కృషి చేశారు. జిల్లాలోని 29 పుష్కర ఘాట్‌లలో 75లక్షల మంది పుష్కర స్నానం ఆచరించగా ఆరు వేల మంది సిబ్బందిని ఉపయోగించి పన్నెండు రో జు ల పాటు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. లింగ నిర్ధారణ చేసే వారిపై, పిండస్థ గర్భచ్చేదనలను ప్రోత్సహి ంచే ఆర్‌ఎంపీలపై కఠిన చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ లో గర్భస్థ ఛేదనకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం కూ డా జరిగింది. 2016లో 370 మిస్సింగ్ కేసులు నమోద య్యాయి. జిల్లాలో 2014లో 46 హత్యకేసులు నమోదు కాగా 2016లో 41 హత్యకేసులు నమోదయ్యాయి.

తగ్గిన దోపిడీ దొంగతనాలు
గత రెండేళ్లలో కంటే 2016లో దొంగతనాలు, దోపిడీలు తగ్గాయి. 2014లో నమోదైన 467 కేసుల్లో రూ.2,41, 52,995 సొత్తు దొంగిలించగా రూ.1,04,58,005 సొత్తును పోలీసులు రికవరీ చేశారు. 2016లో 365 కేసుల్లో దొంగల నుండి రూ.2,40,04,830 స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌పరిధిలో 2016 జనవరి 31న ఒక కోటి ముప్పైఎనిమిది లక్షల రూపాయల దోపిడీ జరుగగా పన్నెండు గంటల్లోనే దోపిడికి పాల్పడిన ఐదుగురు నింధితులను పోలీసులు అరెస్టుచేసి మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. జులై 11న మునుగోడు మండలం కొంపెల్లి వద్ద రూ.35, 50000లు దోపిడి జరుగగా 24గంటల్లోనే కేసును చేధిం చి పిటిషన్‌దారురి, అతని స్నేహితులు దోపిడీకి కారకులని తేల్చి వారి వద్ద నుండి మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

భారీగా ఆయుధాలు స్వాధీనం
జిల్లాలో వేరు వేరు సంఘటనల్లో పోలీసులు భారీగా ఆ యుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దేశవాలి రివాల్వర్‌లు రెండు, రెండు తపంచాలు, అమెరికా తయా రి పిస్టల్ ఒకటి, ఎలక్ట్రిక్ డెటోనేటర్స్ ఎనిమిది, జిలిటన్ స్టిక్స్ 20, తపంచా ఎనిమిది, 0.38 రివాల్వర్‌లు 85, 7.62 తూటాలు 13, దేశవాలి తపంచాలు 25, యూఎస్ ఏ పిస్టల్స్ 30, యుఎస్‌ఏ పిస్టల్ మాగ్జిన్స్ 2 ఆయు ధాలను స్వాధీనం చేసుకున్నారు.
కిడ్నీ రాకెట్ : రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కిడ్నీ రాకెట్‌ను జిల్లా పోలీసులు సమర్థవంతంగా చేదించారు. ఆర్థిక అవసరాలను కలిగిన వారిని గుర్తించి కొత్త మొత్తం లో డబ్బును ఎరచూపి వారి వద్ద నుండి కిడ్నీలను తీసు కొని బయట ప్రాంతాలకు అమ్ముకుంటున్న సురేష్ ప్రజా ప్రతిని పోలీసులు అరెస్టు చేసి ఖరీదైన కార్లు, ల్యాప్ టా ప్‌లు, సెల్‌ఫోన్‌లు, పాస్‌పోర్టులను స్వాధీనం చేసు కు న్నారు. కిడ్నీ రాకెట్‌ను గుట్టుగా కొనసాగిస్తున్న ముఠా సభ్యులలో మొత్తం పదిహేను మందిని అరెస్టు చేశారు.

తగ్గిన మావోయిస్టు కదలికలు : జిల్లాలో ఈ ఏడాది మావోయిస్టుల సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచి, ఐడీ పార్టీ, కౌంటర్ ఇంటలీజన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ కొత్త వ్యక్తుల సమాచారం కదలికలు పసిగడుతూ రాత్రిపూట గస్తీ నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను బైండోవర్ చేశారు. మావోలకు ఆయుధాలు సరఫరా చేస్తున్న కేసులో ఇద్దరిని అరెస్టుచేసి వారి నుండి రెండు పిస్టల్‌లు, తూటాలు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. యాంటీ ర్యాగింగ్, అక్రమ వ్యాపారాలు, అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర కార్యక్రమాలు చేపట్టి పోలీసులు వేగవంతంగా కేసులను అరికట్టడంలో ముందంజలో ఉన్నారు. జిల్లా విభజన తర్వాత నల్లగొండ ఎస్పీగా ఎన్.ప్రకాశ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొద్ది సమయంలోనే జనమైత్రి ద్వారా జిల్లాలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఫ్లోరైడ్ బాధితులకు అండ : ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో బాధితులకు సహాయం అందించేందుకు నవంబర్‌లో మ ర్రి గూడలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. సుమారు ఆరువేల ఫ్లోరైడ్ బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయించారు. పదిహేను మంది ఫ్లోరైడ్ బాధితులకు కేర్‌ఆసుపత్రినందు వైద్యం చేయిస్తున్నారు. వీరికి పోషకాహారం, మందుల ఖర్చు కోసం పోలీసు పునరా వాస పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఆర్‌వో వాటర్‌ప్లాంట్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. మర్రిగూడ మండలంలో ఐదు గ్రామాల్లో రెండు తండాల్లో జనమైత్రి సామాజిక రక్షిత మంచినీటి కేంద్రాల పేరిట వాటర్‌ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు.

అమ్మా నన్ను అమ్మకే : దేవరకొండ నియోజకవర్గంలో శిశు విక్రయాలు, శిశు హత్యలు సామాజిక దురాచా రంగా కొనసాగుతుండగా వీటిపై అవగాహన కొరకు ఎస్‌పీ ప్రకాశ్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్థిక స్థోమ తలేక ఆడ పిల్లలను అమ్ముకుంటున్న మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్లఅవగాహన కల్పించి మూఢనమ్మకాల నుండి ప్రజలను చైతన్యపరిచే దిశగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కుటుంబానికి వారసుడు కావాలనే దురాచారాన్ని విడనాడాలని, బౄణ హత్యంలకు పాల్పడవద్దని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్‌ఐ, సీఐ, డీఎస్‌పీ స్థాయి అధికారులతో పాటు ఎస్పీగా తాను ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చూస్తే జిల్లాలో నేరాల సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గుతూ వచ్చింది.