Wednesday, April 24, 2024

క్రైం ‘డౌన్’

- Advertisement -
- Advertisement -

Crime rate

 

హత్యలు, అత్యాచారాలు నిల్
ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2
సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1
లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు
సోషల్ మీడియాపై 10కేసులు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా నేరాల శాతం భారీగా తగ్గినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నా యి. రాష్ట్రంలో గడచిన 12 రోజుల్లో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులు మినహా ఇతర నేరాలు అత్యల్పంగా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారుణ హత్యలు, అత్యాచారాల కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అదేవిధంగా ఆన్‌లైన్ మోసాలు, చీటింగ్, భారీ దోపిడీలు సైతం రాష్ట్రంలో ఎక్కడా చోటు చేసుకోలేదు. కాగా సైబరాబాద్ పరిధిలో ఓ సైబర్ క్రైం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5వేల లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు నమోదైయ్యాయి. కరోనా వ్యాధి సోకిందన్న భయంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన 12మంది వాట్సప్ గ్రూపుల అడ్మిన్, వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ శివారులోని ఔటర్ రింగ్‌రోడ్ వద్ద గతనెల 29న చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. కర్ణాటక నుంచి వస్తున్న బోలేరో వాహ నా న్ని నూజివీడు నుంచి వస్తున్న లారీ ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందగా, ఉస్మానియా ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యు వాతపడ్డారు. అదేవిధంగా కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వికారాబాద్‌జిల్లా తాండూరు లోని జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళకు కరోనా సోకిందని వాట్సాప్‌గ్రూపులో తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో తీసుకొ చ్చారని ఆమెకు కరోనా సోకిందని, తాండూరులో మొదటి కేసు నమోదైందంటూ కొర్విచెడ్‌కు చెంది న విజయ్‌కుమార్ వాట్సాప్‌గ్రూపులో తప్పుడు పోస్టు పెట్టాడు. పోలీసులు రంగంలోకి దిగి విజయ్ కుమార్‌తో పాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాల్‌రా జ్‌పై ఐపిసి188తో పాటు సెక్షన్54 ఎన్‌డిఎంఎ కింద చట్టాల కింద కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టుచేశారు. ఉప్పల్‌లోని శాంతి నగర్‌లోని నివాసముంటున్న సన్నీ అనే యువ కుడు వైన్ షాపులు తెరుస్తున్నారంటూ నకిలీ ఉత్త ర్వుల ప్రతిని పోస్టు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఆర్డర్ కాపీని వైరల్ చేసిన సన్నీపై కేసు నమోదు చేసి ఆరెస్ట్ చేశారు. ఇలా పలు ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల నేరాలు జరిగాయి.

Crime rate has been reduced with Lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News