- Advertisement -
మనతెలంగాణ/సిరిసిల్ల: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకుని నేరాలను త్వరితగతిన నిరోధించాలని ఎస్‌పి విశ్వజిత్ అన్నారు. శుక్రవారం ఆధునిక సాంకేతిక వ్యవస్థ గురించి పోలీసులకు శిక్షణని చ్చి న సందర్భంగా ఆయన మాట్లాడారు.పోలీస్ శాఖ రూపొందించిన టిఎస్ కాప్ ఇన్వెస్టిగేషన్ అప్లికేషన్‌పై అందరూ అవగాహన పెంచుకోవాలన్నా రు. నేరస్థుల సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చడం గూర్చి వివరిం చారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు కేటాయించిన వాహనాలను పరి శీలించి వాటిని సరైన కండీషన్‌లో ఉంచాలన్నారు. సిరిసిల్లలో డిజిపి మ హేందర్‌రెడ్డి పర్యటించిన సందర్భంగా సూచించిన అంశాలన్నింటిని ఆ చరణలో పెట్టాలన్నారు.ప్రజలను మరింత దగ్గర చేసుకోవాలన్నారు. రా ష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుందని, పోలీసులు త మ పనితీరును మెరుగు పర్చుకోవాలన్నారు.
- Advertisement -