Home తాజా వార్తలు రేవంత్‌పై కేసు

రేవంత్‌పై కేసు

Revanth Reddy

 

గృహనిర్బంధాన్ని ఉల్లంఘించి ప్రగతిభవన్ ముట్టడిలో దురుసుగా ప్రవర్తించినందుకు, పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు నమోదు

ఆసిఫ్‌నగర్ ఎసిపి నర్సింహారెడ్డి బదిలీ

హైదరాబాద్ : పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని తోసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో మల్కాజిగిరి ఎంపి, టి కాంగ్రెస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం నాడు క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.48లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారు జాము నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో బంజారాహిల్స్ ఎ సిపి కె.ఎస్.రావు, జూబ్లీహిల్స్ ఇన్ స్పె క్టర్ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్ ఎస్‌ఐ నవీన్ రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి బయటకు రాకుండా పోలీసులు క ట్టడి చేశారు. కాగా సోమవారం మధ్యా హ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొచ్చారు.

ఇంట్లో నుంచి దూసుకొచ్చే సమయంలో అడ్డుకున్న ఎస్‌ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న ద్విచక్రవాహనంపై ప్రగతిభవన్ వైపు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై చాలాదూరం చేజ్ చేసుకుంటూ వెళ్లిలోపు అప్పటికే రేవంత్రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎస్‌ఐ నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. మిగతా పోలీసులను కూడా నెట్టుకుంటూ వెళ్లడంతో కొందరికి స్వలప్ప గాయా లు కాగా మరొకొందరు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులపై ఎస్‌ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేయగా వారిపై ఐపిసి సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

ఆసిఫ్‌నగర్ ఎసిపిపై బదిలీ వేటు
ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆసిఫ్ నగర్ ఎసిపి నంద్యాల నర్సింహారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నర్సింహారెడ్డిని బదిలీ చేసినట్లు హైదరాబాద్ సిపి అంజనీకుమార్ చెప్పారు. ప్రగతిభవన్ ముట్టడి రోజు రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి ప్రగతిభవన్ కు చేరుకున్నారు.

అప్పటికే పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రత మధ్య కూడా కాంగ్రెస్ నేతలు ముట్టడించేందుకు వెళ్లడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రగతిభవన్ ప్రధాన గేటు వద్ద భద్రతాచర్యలు పర్యవేక్షించిన ఎపిసి నరసింహారెడ్డిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. అక్కడ విధులు నిర్వహించిన బంజారాహిల్స్ ఎసిపి కెఎస్ రావుతో పాటు జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణారెడ్డిపైనా సిపి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Criminal case has been registered against Revanth Reddy