Thursday, April 25, 2024

కేంద్ర మంత్రుల్లో 24మంది తీవ్ర నేరాల్లో నిందితులు: ఎడిఆర్ నివేదిక

- Advertisement -
- Advertisement -

43 leaders sworn-in, 15 take oath as cabinet ministers

కేంద్ర మంత్రుల్లో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 90 శాతం కోటీశ్వర్లు
24మంది తీవ్ర నేరాల్లో నిందితులుః ఎడిఆర్ నివేదిక

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని, 90 శాతంమంది కోటీశ్వరులని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) నివేదిక వెల్లడించింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. కొత్తగా 15మందికి కేబినెట్ హోదా కల్పించగా, 28 మందికి సహాయక మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం సంఖ్య 78కి చేరింది. వీరిలో 33మంది మంత్రులపై(42 శాతంపై) క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 24మందిపై(31 శాతంపై) ఉన్న కేసులు తీవ్రమైనవని, హత్య, హత్యాయత్నం, దోపిడీలాంటి కేసుల్లో వారు నిందితులని ఎడిఆర్ నివేదిక పేర్కొన్నది. ఈ వివరాలన్నీ ఆయా మంత్రులు ఎన్నికల కమిషన్‌కు స్వయంగా సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్నవేనని నివేదిక స్పష్టం చేసింది.
మంత్రివర్గంలోని 90 శాతంమంది కోటీశ్వరులని నివేదిక పేర్కొన్నది. వారిలో మొదటి నాలుగు స్థానాల్లోని మంత్రుల సంపద వివరాలు వెల్లడించింది. జ్యోతిరాదిత్య సింధియా సంపద విలువ రూ.379 కోట్లు, పీయూష్ గోయల్ సంపద రూ. 95 కోట్లు, నారాయణ్‌రాణే సంపద రూ. 87 కోట్లు, రాజీవ్ చంద్రశేఖర్ సంపద రూ.64 కోట్లు. వీరంతా రూ.50 కోట్లకుపైగా ఆస్తులున్నట్టు తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం సగటు ఆస్తుల విలువ రూ.16.24 కోట్లు. కొందరు మంత్రులు తమ ఆస్తులను అతి తక్కువగా పేర్కొన్నారు. వారిలో త్రిపురకు చెందిన ప్రతిమాభౌమిక్ ఆస్తి రూ. 6 లక్షలు, బెంగాల్‌కు చెందిన జాన్‌బర్లా ఆస్తి రూ.14 లక్షలు, రాజస్థాన్‌కు చెందిన కైలాశ్ చౌదరి ఆస్తి రూ.24 లక్షలు, ఒడిషాకు చెందిన బిశ్వేశ్వర్ తుడూ ఆస్తి రూ.27 లక్షలు, మహారాష్ట్రకు చెందిన మురళీధరన్ ఆస్తి రూ. 27 లక్షలుగా ఏడిఆర్ నివేదిక తెలిపింది.

Criminal cases against 42% of New Union ministers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News