Saturday, April 20, 2024

కరోనా వ్యాక్సిన్ కొందరికేనా?

- Advertisement -
- Advertisement -

Criticizes on Vaccination Special Drive in Hyderabad

వారం రోజులు గడుస్తున్నా కాలనీల్లో సర్వేలు లేవు.. టీకా బృందాలు రావు
దృష్టి సారించాలంటూ విజ్ఞప్తులు

మన తెలంగాణ /సిటీ బ్యూరో: కరోనాను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా గ్రేటర్ వ్యాప్తంగా నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు గాను జిహెచ్‌ఎంసి, కంటోన్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ అందరికీ కాదు కొందరికే అన్నట్లుగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాక్పినేషన్ ప్రక్రియకు సంబంధించి తీరుపై కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నప్పటీకీ వేలాది కాలనీల వైపు కన్నెత్తి కూడా చూడలేదన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కనీసం మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ల ఎక్కడా ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిమెచ్‌ఎంసి హెల్ప్ లైన్ నంబర్‌ను సం ప్రదించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అయితే ఈ ప్రక్రియ ప్రహాసంగా ఉంటోందంటున్నారు.

మాటలకు చేతలకు పొంతనే లేదు

స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారుల మాటలకు చేతలకు పొంతనే కుదరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ వ్యా ప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలను వేసేందుకు గ్రేటర్ వ్యాప్తంగా 175 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వీటి ద్వారా నగరవాసులకు టీకాలను వేస్తున్నారు. అయితే టీకా తీసుకున్నవారు ఎవరు తీసుకోని వారు ఎవరు అనేదానిపై గుర్తించి వారికి టీకాలను వేసేందుకు బల్దియా అధికారులు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈసర్వే ద్వారా టీకా అసలే తీసుకోనివారితో పాటు రెండవ డోసు తీసుకోవాల్సి ఉన్నవారి సమాచారాన్ని ఈ సర్వే బృందాలు మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్లవారికి అందజేస్తారు. దీంతో ఆ తర్వాత మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి టీకాలు వేస్తారని ప్రకటించారు. అయితే ఈ సర్వే బృందాలు కేవలం బస్తీలు, మురికివాడలోనే పర్యటిస్తున్నారు తప్పిస్తే కాలనీలను పట్టించుకోవడం కారణంగానే మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలు తమకు టీకాలను ఇవ్వలేకపోతున్నాయని పలు కాలనీల వాసులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.

టీకాకు సంబంధించి జిహెచ్‌ఎంసి హెల్ప్‌లైన్ నంబర్ 040 2 1111111లకు ఫోన్ చేస్తే వారు సంబంధింత సర్కిల్ అధికారులకు లైన్ కనెక్ట్ చేస్తున్నారని అయితే పలువురు ఆ ఏరియా తమది కాదంటూ పేర్కొంటుడడంతో సరైన సమాచారం లభించని పరిస్థితులు ఉన్నాయని పలు కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రెండవ డోస్ తీసుకోవాల్సిన వారు గడువు మించిపోవడంతో తీవ్ర ఆందోళలకు గురువుతున్నారు. ఇప్పటికైనా క్రమ పద్ధ్దతిలో అన్ని కాలనీల్లో ఇంటి స ర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ బృందాలు ఎప్పుడు శిబిరాలు ఏర్పాటు చేస్తాయో వెల్లడిస్తే ఆ రోజు పనులు మానుకోనైనా టీకా తీసుకునేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. దీనిపై అధికారులు దృష్టి సా రించి వెంటనే చర్యలు తీసుకుకోవాలని కాలనీల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News